జపాన్ దేశస్తుడికి సెల్ ఫోన్ అప్పగింత
భీమునిపట్నం: సైకిల్‌పై ప్రపంచ యాత్ర చేస్తున్న జపాన్ దేశస్తుడు గురువారం తన సెల్‌ఫోన్ పోగొట్టుకోగా క్రైం పోలీసులు వెతికి అతనికి అప్పగించారు. వివరాలివి. జపాన్‌కు చెందిన తొషియుకి షిషిడా తన యాత్రలో భాగంగా ఒడిశా నుంచి హైవేపై విశాఖపట్నం వస్తున్నారు. అయితే తగరపువలస సమీపంలోకి వచ్చేసరికి తన సెల్‌ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే అతను భీమిలి క్రైం స్టేషన్‌కు వచ్చి ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అయితే అది జాతీయ రహదారిపై భోగాపురం పరిధిలోని మహరాజుపేట వద్ద ఉంది. ఆ ప్రాంతం తమ పరిధిలోనిది కానప్పటికీ ఎస్‌ఐ సూర్యప్రకాశ్, కానిస్టేబుల్ రాజేష్‌తో అక్కడకు వెళ్లి సెల్‌ఫోన్‌ను సేకరించారు. అనంతరం జపాన్ దేశస్తుడికి అందజేశారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే ఫోన్‌ను వెతికి అప్పగించిన పోలీసులకు షిషిడా ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment