వైభవంగా అనంతుని రఽథోత్సవం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో అనంతుని కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అనంత పద్మనాభ స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా విశేష హోమం, గ్రామ బలిహరణం, మంగళాశాసనం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలు, నాద మునీశ్వరుల స్వరాల నడుమ రథంపైకి తోడ్కొని వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథం ముందు కుంభం(అన్నం) పోశారు. స్థానిక సీఐ సిహెచ్.శ్రీధర్ ప్రథమ పూజ అనంతరం గాలి గోపురం వద్ద నుంచి రథోత్సవం ప్రారంభమైంది. పూలమాలలు, అరటి చెట్లు, విద్యుద్దీపాలతో అలంకరించిన రఽథం భక్తుల గోవింద నామస్మరణల నడుమ ముందుకు సాగింది. రాజ వీధి గుండా అనంత పద్మనాభ స్వామి రథచక్రాలు వడివడిగా ముందుకు కదిలాయి. ఈవో నానాజీ బాబు పర్యవేక్షణలో జరిగిన ఈ రథోత్సవంలో ఎంపీపీ రాంబాబు, పద్మనాభం సర్పంచ్ టి.పాప, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా అనంతుని రఽథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment