
స్వచ్ఛ సర్వేక్షణ్, పీ–4 సర్వేపై ప్రత్యేక దృష్టి
డాబాగార్డెన్స్: స్వచ్ఛ సర్వేక్షణ్.. స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ ఎంఎన్ హరేందిరప్రసాద్ ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జోనల్, వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విశాఖ నగరంలో స్వచ్ఛ సర్వే క్షణ్ సర్వే బృందం కొద్ది రోజుల్లో సర్వే నిర్వహించనుందని, అందుకు తగిన పారామీటర్లలో లోపా లు గుర్తించి సవరించేలా చూడాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షణ జరుపుతూ నేరుగా ప్రజలను కలిసి సంబంధిత విషయాలపై అడిగి, వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. నగరంలో జరుగుతున్న పి–4 సర్వేను 18లోగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులకు ప్రజలు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment