
రేపు వినియోగదారుల హక్కులపై జాతీయ స్థాయి సదస్సు
డాబాగార్డెన్స్: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 15న వినియోగదారుల చట్టం అమలుపై అవగాహన కల్పించడంతోపాటు జాతీయ స్థాయి శిక్షణా సదస్సు నిర్వహించనున్నట్లు కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఈ సదస్సులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు వినియోగదారుల హక్కుల మండలి జిల్లా, రాష్ట్ర, జాతీ య స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ సివిల్ సప్లయ్ ఆఫీసర్ మురళీనాథ్, చంద్రశేఖర్, ప్రసాద్‌రాజు, బాలకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment