లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
విశాఖ విద్య: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన అసోసియేషన్ సమావేశంలో పి.గోపాలనాయు డు ఎన్నికల అధికారిగా కమిటీని ఎంపిక చేశా రు. అధ్యక్షుడిగా ఆర్.పి.నాయుడు(వీఎస్ కృష్ణా కాలేజీ), ఉపాధ్యక్షురాలుగా ఎ.శ్రీదేవి( పెందుర్తి), ప్రధాన కార్యదర్శిగా బి.మాధవరావు(భీమునిపట్నం)జాయింట్ సెక్రటరీగా పి.సుమతి(ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీ విశాఖ), కోశాధికారిగా పి.హేమంత్ కుమార్(కృష్ణా కాలేజీ), మహిళా కార్యదర్శిగా ఎల్.ఉమామహేశ్వరి (పెందుర్తి), రాష్ట్ర కౌన్సిలర్‌గా పీఎంకేఎం నాయుడు(కృష్ణా కాలేజీ)లను ఎన్నుకున్నారు. మూడేళ్లపాటు నూతన కమిటీ పనిచేయనుందని ఎన్నికల అధికారి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment