
పదో తరగతి ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థుల ప్రతిభ
సీతంపేట: 10వ ఫలితాల్లో శ్రీ విశ్వ స్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. షేక్ షాజిద్ అహ్మద్ 594 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచాడు. రెడ్డి బాల ఆదిత్య 593, పసుపులేటి శశాంక్ 593, జల్ధు మహతి 591, మేడూరి సాహితి 589, మసాపు రోహిత్ 588 మార్కులు సాధించారు. 580కిపైగా 8 మంది, 550కిపైగా 53 మంది, 500లకు పైగా 91 మంది సాధించారు. వీరిని శ్రీవిశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె.ఎస్.హెచ్.ఆర్.కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ అభినందించారు.