కోడి పందాలపై పోలీసుల దాడి
● అదుపులోకి 9 మంది నిందితులు
● రూ.13,760 నగదు స్వాధీనం
లక్కవరపుకోట: గ్రామాల్లో నిర్వహించే తీర్థాల సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలపై లక్కవరపుకోట పోలీస్‌లు కొరడా ఝుళిపించారు. కోడి పందాలు, ఏట్లాట (నాణాలు తిప్పే ఆట) వంటి అసాంఘిక కార్యక్రమాలపై ఎస్సై నవీన్‌పడాల్ తన సిబ్బందితో శుక్రవారం దాడి చేశారు. మండలంలోని సంతపేట గ్రామం సమీపంలో గల మామిడి తోటల్లో రహస్యంగా నాణాలు తిప్పే జూదం ఆటపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ 10,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆదే గ్రామ శివారు గల పశువుల కళ్లాల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాలపై దాడి చేశారు. అక్కడ పందాలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 కోడి పుంజలు, రూ.3,560 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment