యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సాలూరు రూరల్: పార్వతీపురం జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గడిచిన మూడు నెలల పాటు నిర్వహించి శుక్రవారం మండలంలోని తోణాం గ్రామంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో సాలూరు మండలం మెండంగి గిరిజన యువత విజేతలుగా నిలిచారు. అలాగే ద్వితీయ స్థానంలో మక్కువ మండలం కోన టీమ్ గెలుపొందింది. గెలుపొందిన టీమ్‌లకు ఎస్పీ మాధవ రెడ్డి, ఏఎస్పీ అంకితా సురానా మహరాణా బహుమతులు అందజేశారు. అలాగే సెమీ ఫైనల్‌లో పాల్గొన్న పాచిపెంట, మక్కువ, సాలూరు, పార్వతీపురం రూరల్ టీమ్‌లకు వాలీబాల్ కిట్లతో పాటు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ రెడ్డి మాట్లాడుతూ గరిజన యువతకు ఆటలపోటీలపై ఆసక్తిని పెంపొందించేందుకు పోలీసుశాఖ తరఫున ఈ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. పాఠశాలలో మత్తుపదార్దాలు ఎవరైనా సరఫరా చేసినట్లు సమాచారం తెలిసినట్లు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదుచేయబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్సై, నరసింహమూర్తి పోలీసులు పాల్గొన్నారు.
ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ అంకితా సురానా
Comments
Please login to add a commentAdd a comment