
పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత పునఃప్రారంభించిన ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో వినతులు అందాయి. కలెక్టర్ డాక్టర బీఆర్‌అంబేడ్కర్, ఇన్‌చార్జ్ జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ మురళి వినతులను స్వీకరించగా ఈ వారం మొత్తం 231 అర్జీలు వచ్చాయి.
తప్పుగా ఎండార్స్‌మెంట్ ఇస్తే క్రమశిక్షణ చర్యలు
పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి అందిన వినతులకు ఏ విధమైన పరిష్కారం చూపిస్తున్నదీ సంబంధిత అర్జీదారుకు ఆయా ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ డాక్టర్ అంబేడ్కర్ అధికారులకు స్పష్టం చేశారు. వినతుల పరిష్కారంలో తప్పుగా ఎండార్స్‌మెంట్ ఇచ్చి పరిష్కరించినట్లు పేర్కొంటే ఆయా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే తప్పుగా ఎండార్స్‌మెంట్ ఇచ్చిన 33 మంది అధికారులకు మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 37 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 37 ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లు 10, ఇతర అంశాలకు సంబంధించి 13 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్‌కే చౌదరి, డీసీఆర్‌బీ ఎస్సై రాజేష్, సిబ్బంది కృష్ణ, షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.
వినతులను స్వీకరించిన కలెక్టర్ అంబేద్కర్

పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు
Comments
Please login to add a commentAdd a comment