వైద్యులు సమయపాలన పాటించాలి
శాయంపేట: వైద్యులు సమయపాలన పాటించాల ని, హెచ్‌ఎంపీవీపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగా హన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్ప య్య సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, హాజరు పట్టికలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆశ డే కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. కొత్తగా ప్రజలను భయపడుతున్న హెచ్‌ఎంపీవీపై ప్రజలకు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు వివరించాలని చెప్పారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యులు శశికుమార్, విద్యశ్రీ, సీహెచ్‌ఓ సుగుణ, హెచ్‌ఈఓ వెంకటేశ్వరవర్మ, సూపర్‌వైజర్లు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య
శాయంపేట పీహెచ్‌సీలో తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment