సర్వేకు ప్రజలు సహకరించాలి
వరంగల్: కులగణన సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి కోరారు. వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయం, కరీమాబాద్ మీసేవ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆదివారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో రీసర్వేలో నమోదు వివరాల తీరు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనవు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 28 వరకు సర్వే నిర్వహిస్తారని, ఇప్పటివరకు నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం తిరిగి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. వరంగల్‌లోని పోచమ్మమైదాన్ ఈసేవ కేంద్రం, కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ కేంద్రం, కరీమాబాద్ మీసేవ కేంద్రం, నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జీడబ్ల్యూఎంసీ వరంగల్ పరిధిలోని అన్ని వార్డులు, నర్సంపేట మున్సిపల్ వార్డుల్లో విస్తృత ప్రచారం చేసి కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారిని ప్రోత్సహించాలని సంధ్యారాణి అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–211111111 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా https://seeepcsurvey.cgg.gov.in నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి ప్రజా పాలన కేంద్రాల్లో అందించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు సర్వేకు సహకరించి, పూర్తి వివరాలను ఇవ్వాలని ఆదనవు కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, బల్దియా రెవెన్యూ అధికారి షాజాదిబేగం, పర్యవేక్షకులు హబీబుద్దీన్, ఆర్‌ఐ సోహైల్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
Comments
Please login to add a commentAdd a comment