సేవలు మరింత చేరువ
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. అందులో భాగంగా విద్యుత్ సర్వీసుల మంజూరును మరింత సులభతరం చేశారు. వినియోగదారుడికి కొత్త సర్వీసుల మంజూరులో సరైన డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుంటే ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వచ్చారు. ఇకపై ఏదేని కారణంచేత దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంటే దాన్ని తిరస్కరించకుండా మంజూరుకు కావాల్సిన ప్రక్రియను పూర్తిస్థాయిలో అందించేలా విద్యుత్ శాఖ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసినప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇది వరకు దరఖాస్తు ఎక్కడి వరకు వచ్చిందో తెలియక దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరిగే వారు. ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చాక కార్యాలయం చుట్టూ తిరిగాల్సి న అవసరమే లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నంబర్‌తో టీజీ ఎన్పీడీసీఎల్ వెబ్‌సైట్ నుంచి లేదా టీజీ ఎన్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా అప్లికేషన్ స్థితిని తెలుసుకోగలుగుతారు. అయినప్పటికీ సంతృప్తి చెందకపోతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
వినియోగదారుడికి మెరుగైన సేవలు
వినియోగదారుడికి మరింత మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తున్నాం. ఈక్రమంలో విద్యుత్ నూతన సర్వీసుల మంజూరు వేగవంతం, సులభతరం చేశాం. సేవలను వినియోగించుకోవాలి.
– కె.వెంకటరమణ, హనుమకొండ సర్కిల్ ఎస్‌ఈ
వినియోగదారుల ముందుకు సాంకేతికత
వినియోగదారుల ముంగిటికి సాంకేతిక సేవలను తీసుకెళ్తున్నాం. విద్యుత్ సర్వీస్ మంజూరులోనూ సాంకేతికతను వినియోగిస్తున్నాం. మంజూరులో జరిగే ప్రతీ ప్రక్రియను వినియోగదారుడు తెలుసుకునేలా సౌకర్యం కల్పించాం.
– మధుసూదన్, ఎస్‌ఈ, వరంగల్ సర్కిల్
అందుబాటులోకి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టం
వినియోగదారులకు తప్పిన తిప్పలు
సేవలు మరింత చేరువ
సేవలు మరింత చేరువ
Comments
Please login to add a commentAdd a comment