
వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఇందుకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ డాక్టర్ టీకే.శ్రీదేవి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్, ఆర్‌టీసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ భారత ప్రభుత్వం ‘పీఎం ఈ–బస్ సేవా పథకం’లో భాగంగా హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌కు జనాభా ప్రాతిపదికన 100ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీతో పాటు ఆర్‌టీసీ, ఎన్‌పీడీసీఎల్, హన్మకొండ వరంగల్ జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. వీసీలో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీసీ ఆర్‌ఎం బాలు నాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ మధుసూదన్, ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, వరంగల్ ఆర్టీఓ శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
వాస్తవాలతో కూడిన నివేదిక
అందచేయండి
రాష్ట్ర పురపాలక శాఖ
కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment