హెచ్‌ఆర్‌డీఏ, కేఎంసీ జూడాల నిరసన
ఎంజీఎం : అక్రమంగా వైద్య సేవలు అందించే క్వాక్స్‌కు సర్టిఫికెట్ మంజూరు చేయాలని ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్యలు నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా ఉన్నాయి.. తీవ్రంగా ఖండిస్తున్నామని హెల్త్‌కేర్ రిఫార్మస్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్‌ఆర్‌డీఏ), కేఎంసీ జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కేఎంసీ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఒక వైపు వేలాది మంది మెడికల్ విద్యార్థులు అధునాతన, నాణ్యమైన వైద్యవిద్య కోసం పోరాడుతున్నారని అన్నారు. వైద్య కళాశాలల్లో తగిన బోధనా సిబ్బంది, భవనాలు లేక ఇబ్బందులు పడుతుండగా.. కోదండరాం నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా మాట్లాడడం ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని అన్నారు. ఆయన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment