
‘ఏటీబీ’కి జాతీయస్థాయి గుర్తింపు
దుగ్గొండి : కేంద్ర ప్రభుత్వ ఇన్నోవేషన్ సెల్, విద్యామంత్రిత్వ శాఖ సంయుక్తంగా ప్రతి ఏడాది స్కూల్ ఇన్నోవేషన్ పోటీ లు నిర్వహిస్తోంది. విద్యార్థుల సామర్ధ్యాలను గు ర్తించి పరిష్కారాలను రూ పొందించడం..నూతన ఆవిష్కరణలు, సృతజనాత్మకత, ఉత్పత్తి వంటి ఆలోచనలను పెంపొందించడానికి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ పోటీలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది.
1.20లక్షల ఆవిష్కరణల్లో
1,200 ఆవిష్కరణలే గుర్తింపు..
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నిర్వహించిన పోటీలకు 1.20లక్షల ఆవిష్కరణలు రాగా 1,200 ఆవిష్కరణలను జాతీయస్థాయి కి ఎంపిక చేశారు. ఇందులో వరంగల్ జిల్లా నుంచి దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రిషిక్ రూపొందించిన ఏటీబీ(ఎనీటైం బ్యాగు) ఆవిష్కరణ ఒక్కటే జాతీయస్థాయికి ఎంపికై ంది. ఎన్నికై న ఏటీబీని ఆవిష్కరణను మంగళవారం ఆన్‌లైన్‌లో రాజ్‌కోట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఎదుట ప్రదర్శించాడు. ప్లాస్టిక్ వా డకం భారీగా పెరిగిపోయి కాలుష్యానికి దారితీస్తుంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా దుస్తువులతో తయారు చేసిన సంచులు (క్లాత్ బ్యాగులు) వాడేటట్టు గైడ్ టీచర్ సుమలత పర్యవేక్షణలో రూపొందిన ఎనీటైం బ్యాగు ఆవిష్కరణను ప్రొఫెసర్లు ప్రశంసించారని హెచ్‌ఎం జ్యోతిలక్ష్మి పేర్కొన్నారు.
ఏటీబీ పనితీరు ఇలా..
ఏటీఎం మిషన్లలో డబ్బులు తీసుకునే విధానాన్ని ప్రాతిపదికగా తీసుకుని రూ.5 నాణెం వేస్తే ఎనీ టైం బ్యాగ్ (దుస్తువులతో తయారు చేసిన సంచి) వచ్చేలా రిషిక్ నూతన ఆవిష్కరణ చేశాడు. మోడల్ పరి కరాన్ని అట్ట ముక్కలతో తయారు చేశాడు. మిషన్‌లో 500 వరకు క్లాత్ బ్యాగులను నిల్వ చేయొచ్చు. దీంతో పాటు అందులో ఏర్పాటు చేసిన స్పీకర్ ని త్యం ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, క్లాత్ సంచుల వినియోగం వల్ల కలిగే లాభాలు వివరిస్తుంది. కూరగాయల మార్కెట్లు, బస్టాండ్ సెంటర్లలో దీనిని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని రిషిక్ అంటున్నాడు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి రూ.25వేల వరకు ఖర్చు అవుతుందని వివరించాడు. మిషన్ తయారీకి కేంద్ర ఇన్నోవేషన్ సెల్‌కు వివరించగా వారు ఆర్థికసాయం అందిస్తామని చెప్పినట్లు రిషిక్ పేర్కొన్నాడు.
ఎనీటైం బ్యాగును ఆవిష్కరించిన రిషిక్
రాజ్‌కోట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఎదుట
ఆన్‌లైన్‌లో ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment