
పూడికతీత పనులు వేగవంతం చేయండి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
● అధికారులతో కలిసి
భద్రకాళి చెరువు పరిశీలన
నయీంనగర్/హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం భద్రకాళి చెరువు పూడకతీత పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పూడికమట్టిని వాహనాల్లో తరలించడానికి అంతర్గత రోడ్డు నిర్మించాలని సూచించారు. పనులు జరుగుతున్న చోట రాత్రి సమయంలో విద్యుత్ బల్బులు ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించా. మట్టి తరలించే వాహనాల నమోదు కోసం చెక్‌పోస్ట్ ఏర్పాటుచేసి రెవెన్యూ, పోలీస్, సాగునీటి పారుదల, మున్సిపల్ శాఖల సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణ, తనిఖీ ఉండేవిధంగా చూడాలని పేర్కొన్నారు. పూడికమట్టి కావాలనుకునే వారు క్యూబిక్ మీటరుకు రూ.72 చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, మున్సిపల్, కుడా, సాగునీటిపారుదల శాఖల అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment