వర్ధన్నపేట: గ్రామైక్య సంఘాల నెలసరి లావాదేవీలను నిర్లక్ష్యం చేయొద్దని డీఆర్‌డీఏ ఏపీఎం వేణు, సీబీఓ ఆడిటర్ వెంకట్ కోరారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో మండలంలోని ఉప్పరపల్లి, నల్లబెల్లి, కట్య్రాలతోపాటు సంగెం మండలంలోని వెంకటాపురం, నల్లబెల్లి గ్రామాల గ్రామైక్య సంఘాల రికార్డులను మంగళవారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేణు, వెంకట్ మాట్లాడారు. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నట్టు తెలిపా రు. సంఘాల లావాదేవీల్లో పొరపాట్లు చోటు చేసుకుంటే వీఓ సహాయకులు (వీఓఏలు), వీఓ ప్రతిని ధులు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. సంఘాల వసూళ్లు, చెల్లింపులకు సంబంధించిన సరైన ఆధారాలు నమోదు చేయాలని స్పష్టం చేశా రు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వీఓఏలు, వీఓ ప్రతి నిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీ ల్లో వెలుగు చూసిన లోపాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. తనిఖీలో సీసీలు గోలి కొమురయ్య, స్వామి, సీ్త్రనిధి మేనేజర్ కపిల్, వీఓఏ ప్రతినిధి కట్ట రజిత, వీఓఏలు బిర్రు దయాకర్, మంజుల, భిక్షపతి, రాము, రాజా రాణి, ఎంఎస్ అకౌంటెంట్ రేవతి, సీఓ మురళి పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ ఏపీఎం వేణు, ఆడిటర్ వెంకట్
Comments
Please login to add a commentAdd a comment