
మండల స్థాయి స్టాక్ పాయింట్లు
మొత్తం రేషన్ దుకాణాలు 2,364
ప్రతినెల రేషన్ బియ్యం పంపిణీ 33,153.976మెట్రిక్ టన్నులు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాత మగ్దుంపురం గ్రామంలో సోమవారం రూ.2.50 లక్షల విలువ చేసే 100 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ననుమాస కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 15న రూ.82,500 విలువ చేసే 33 క్వింటాళ్లు, 16న కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.32,500 విలువైన 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బత్తుల దుర్గమ్మ, గంట సారయ్య, తూర్పాటి కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మొత్తం యూనిట్లు
(కుటుంబ సభ్యులు)
32,55,776
..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో 1,024 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 560 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. రోజుకు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం వయా హుజూరాబాద్, కాళేశ్వరం ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలుతున్నాయి. మామూలు తనిఖీల్లోనే ఇంత పెద్దమొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయంటే ‘రేషన్’ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్, హనుమకొండ, పరకాల, జనగామ, నర్సంపేట, ములుగు, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి సాగుతున్న రేషన్ బియ్యం దందా ఎల్లలు దాటుతోంది. వరంగల్ ఈ దందా వెనుక కొందరు రైస్‌మిల్లర్లే కీలకం కాగా.. భీమదేవరపల్లి మండలానికి చెందిన ఒకరు హసన్‌పర్తికి మకాం మార్చి ‘మేనేజ్’ చేస్తూ ‘కోటి’కి పడగెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇతడికి సంబంధించిన రేషన్ బియ్యం వందల క్వింటాళ్లు పోలీసులకు దొరుకుతున్నా.. ఎఫ్‌ఐఆర్ నమోదైనా.. ఆ సమయంలో ‘పరారీ’లోనే ఉంటాడు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తాపీగా పోలీసులకు చిక్కే ఆ వ్యక్తికి అన్ని వర్గాల మద్దతు ఉందన్న చర్చ ఉంది.
మహారాష్ట్ర
18
కమిషనరేట్ పరిధిలో
ప్రధాన కేంద్రాలు..
Comments
Please login to add a commentAdd a comment