ఛత్రపతి శివాజీకి ఘన నివాళి
సాక్షి, నెట్‌వర్క్: జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం పలు సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో శివాజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు కృషిచేసిన శివాజీని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వేడుకల్లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్, ఆరె సంక్షేమ సంఘం, ఏబీవీపీ, బీజేపీ, బీజేవైఎం, ఛత్రపతి శివాజీ యువదళ్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment