నర్సంపేట: ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చడానికి కృషిచేయాలని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు నర్సంపేట డిపోలో ఉద్యోగులకు బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. పర్యవేక్షకుడు, వరంగల్ రీజియన్ డిప్యూటీ ఆర్‌ఎం కేశరాజుభానుకిరణ్ మాట్లాడుతూ ప్రయాణికులకు సేవలు అందించేందుకు కండక్టర్లు, డ్రైవర్లు, అందుబాటులో ఉండాలని, ఆర్టీసీ సిబ్బంది సహకారంతో మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని వివరించారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ భవాని, ఎంఎఫ్ ప్రభాకర్, ఎస్‌డీఐ వెంకటేశ్వర్లు, సేఫ్టీ వార్డెన్ బాబు, ఏడీసీ మల్లికార్జున్, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment