గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
హనుమకొండలో చేతులకు సంకెళ్లతో
నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు
పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే
ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు అ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్:
జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు.
పట్నవాసం వద్దు.. పల్లె నివాసమే బెస్ట్
ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లలోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148 మంది 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3 శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763 మందికి 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671కి 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు.
జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో)
జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23
వరంగల్ అర్బన్ 1,40,994 1,26,594 1,55,055 1,86,618
వరంగల్ రూరల్ 1,55,802 1,65,549 1,95,115 2,20,877
జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424
మహబూబాబాద్ 1,37,562 1,44,479 1,79,057 2,00,309
జేఎస్.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655
ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772
న్యూస్‌రీల్
జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనుకబాటు
రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు
జేఎస్ భూపాలపల్లిలో తగ్గి..
ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’
15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి
హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా..
మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే
‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment