కార్పొరేట్‌కు అనుకూలంగా బడ్జెట్
– 9లోu
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
శాయంపేట: మండలంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను, మాందారిపేట శివారులోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల్లోని వంట గది, చేసిన వంటలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో నీటి సమస్య ఉందని ప్రిన్సిపాల్.. అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే మిషన్ భగీరథ డీఈ, ఏఈలతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంట నిర్వాహకులు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, ప్రతీరోజు తాజా కూరగాయలు తెప్పించి వంట చేయాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపాల్ రేవతి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మాధవి ఉన్నారు.
ముల్కనూర్ సహకార సంఘాన్ని సందర్శించిన మాల్దీవ్స్ బృందం
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార సంఘాన్ని బుధవారం మాల్దీవ్స్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సంఘం కార్యకలాపాలను ఆ బృందానికి వివరించారు. సంఘం అభివృద్ధి చెందిన తీరును తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల్దీవుల ట్రైనర్ హుస్సేన్ వాది, అడ్మిన్ ఆఫీసర్ ఈమా, ఎన్‌ఐఆర్డీ కోఆర్డినేటర్ అరుణ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తలసరి ఆదాయంలో
భూపాలపల్లే బెటర్..
2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132 కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది.
వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174కు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే, రూ.1,86,278 ఉన్న
జనగామ ఈసారి రూ.2,21,424తో 16, రూ.1,79,222తో 20వ స్థానంలో ఉన్న
మహబూబాబాద్ రూ.2,00,309తో 25వ స్థానం, రూ.1,77,316తో 21వ స్థానంలో ఉన్న ములుగు రూ.2,15,772తో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086తో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618తో 31వ స్థానంలో
ఉంది.
జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..
జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం
హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629
వరంగల్ 7,37,148 5,10,057 2,27,091
జనగామ 5,34,991 4,63,634 71,357
జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387
మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376
ములుగు 2,94,671 2,83,178 11,493
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
కార్పొరేట్‌కు అనుకూలంగా బడ్జెట్
Comments
Please login to add a commentAdd a comment