వరంగల్ అర్బన్ : కీలకమైన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ రూపామిశ్రా సూచించారు. బుధవారం దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఎంపికై న నగరాల మేనేజింగ్ డైరెక్టర్లు, కమిషనర్లు, అధికారులతో ఆమె న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధి పనులు పురోగతిపై సమీక్షించారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు పూర్తయినప్పటికి మరికొన్ని నెలలు పొడిగించినట్లు తెలిపారు. అయినప్పటికి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. నిర్ణీత గడువులోగా నిధులు వినియోగించుకొని పనులు పూర్తి చేయాలన్నారు.
పనుల్లో వేగం పెంచాల్సిందే: కమిషనర్
స్మార్ట్ సిటీ పనులను నిర్ధిష్ట గడువులోగా ఇంజనీర్లు వెంట పడి పూర్తి చేయాల్సిందేనని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. వీసీ ముగిసిన అనంతరం కమిషనర్, ఇంజనీర్లు హనుమకొండలో క్షేత్రస్థాయిలో స్మార్ట్‌సిటీ పనులను తనిఖీ చేశారు.
నిధులను వినియోగించుకోండి
అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన
పూర్తి చేయాలి
కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా
Comments
Please login to add a commentAdd a comment