ఎక్కడి చెత్త అక్కడే!
చెన్నారావుపేట: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతోపాటు అదనపు ఆదాయం సమకూర్చేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు సంవత్సరాల క్రితం రూ.రెండు లక్షల ఉపాధి హామీ నిధులతో డంపింగ్ యార్డును నిర్మించింది. కానీ, నిర్వహణ పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. నిర్మించినప్పటి నుంచి వృథాగా కనిపిస్తున్నాయి.
సిబ్బంది లేర నే సాకుతో..
జిల్లాలోని ఏ గ్రామ పంచాయతీలో కూడా తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మికంపోస్ట్ ఎరువును తయారు చేయడం లేదు. కొన్ని గ్రామాల్లో డంపింగ్‌యార్డుల సమీపంలో పోసి చెత్తను కాల్చివేస్తుండగా.. మరికొన్ని గ్రామాల్లో రోడ్లపై వేస్తున్నారు. సరిపడా సిబ్బంది లేరని, ఉన్న పనులు చేయడానికి సమయం సరిపోవడం లేదని, కొత్తగా డంపింగ్‌యార్డుల నిర్వహణ ఎలా చేపట్టాలని కొంతమంది పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. వీటి నిర్వహణ విషయంలో మండల, జిల్లాస్థాయి అధికారులు సైతం శ్రద్ధ చూపించకపోవడం శోచనీయం. కనీ సం ఏడాదిలో ఒక్కసారైనా వాటి పరిస్థితి ఎలా ఉందో కూడా అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి డంపింగ్‌యార్డుల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఎంపీఓలకు ఆదేశాలిచ్చాం..
తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయించి, సేంద్రియ ఎరువు తయారు చేయించాలని ఎంపీఓలకు ఆదేశాలు ఇచ్చాం. పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించాలని సూచించాం. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటాం.
– కల్పన, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో నిరుపయోగంగా డంపింగ్‌యార్డులు
గ్రామాల్లో రోడ్లపై పేరుకుపోతున్న
చెత్తాచెదారం
పట్టించుకోని పాలకులు, అధికారులు
11 గ్రామీణ మండలాల్లో
320 కంపోస్ట్ షెడ్ల నిర్మాణం
ఉపయోగంలోకి తేవాలి..
కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో తడి చెత్త, పొడి చెత్త వేరుచేయాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో డంపింగ్ యార్డులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించింది. అంతేకాకుండా సేంద్రియ ఎరువు తయారు చేసి విక్రయిస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చేది. అధికారుల నిర్లక్ష్యంతో డంపింగ్‌యార్డుల్లో కాకుండా చెత్తను వేరే ప్రదేశాల్లో వేసి కాల్చేయడంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. దీంతో ప్రభు త్వ లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డులను ఉపయోగంలోకి తేవాలి.
– ఎర్ర రాజు, కోనాపురం
ఎక్కడి చెత్త అక్కడే!
ఎక్కడి చెత్త అక్కడే!
Comments
Please login to add a commentAdd a comment