280 బస్తాల నూకలు స్వాధీనం
● కేసు నమోదు చేసిన పోలీసులు
నెక్కొండ: లారీలో అక్రమంగా తరలిస్తున్న 280 బస్తాల నూకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం నూకలు తరలిస్తున్న లారీని ఈ నెల 19న రాత్రి సమయంలో నెక్కొండలో పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన డ్రైవర్ సంతోష్‌ను అదుపులోకి తీసుకుని లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను విచారించగా మండల కేంద్రానికి చెందిన గందె సజన్‌కు సంబంధించిన నూకలని తేలింది. సమాచారం మేరకు పౌరసరఫరాల డీటీ సంధ్యారాణి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నూకలు రేషన్ బియ్యానికి సంబంధించినవా కాదా అనే కోణంలో విచారణ చేపట్టారు. నూకల శాంపిళ్లను సేకరించి టెస్ట్‌కు పంపనున్నట్లు ఆమె తెలిపారు. సివిల్ సప్లయీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. 112 క్వింటాళ్ల (280 బస్తాలు) నూకల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు.
నల్లబెల్లి ఎంఈఓగా
వసంతను కొనసాగించాలి
వరంగల్: నల్లబెల్లి ఇన్‌చార్జ్ ఎంఈఓగా వసంతను కొనసాగించాలని ఎమ్మార్పీఎస్, ఎల్‌హెచ్‌పీఎస్, ఎరుకుల సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సత్యశారదను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్‌చార్జ్ ఎంఈఓగా పనిచేస్తున్న వసంతను కొందరు బాధ్యతల నుంచి తొలగించారని ఆరోపించారు. ఈవిషయంపై పునరాలోచన చేసి ఆమెను కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొమ్ముల బాబు, జైసింగ్ రాథోడ్, మంద కుమార్ పాల్గొన్నారు.
‘నిట్ స్ప్రింగ్‌స్ప్రీ–25’కి
బ్రహ్మానందం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఈనెల 28, మార్చి 1, 2 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న స్ప్రింగ్‌స్ప్రీ–25 వేడుకలకు ముఖ్య అతిథిగా హాస్య నటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం హాజరు కానున్నట్లు నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య తెలిపారు. ౖస్ప్రింగ్‌స్ప్రీ–25 వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వాన పత్రికను గురువారం హెదరాబాద్‌లోని బ్రహ్మానందం నివాసంలో అందజేసినట్లు డీన్ శ్రీనివాసాచార్య తెలిపారు. నిట్‌లో ప్రతీ ఏడాది వార్షిక సాంస్కృతిక మహోత్సవం వసంతోత్సవాన్ని నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి నిట్ వసంతోత్సవానికి విద్యార్థులు వస్తుంటారని, ఈఏడాది హాస్య నటుడు బ్రహ్మా నందం రాకతో స్ప్రింగ్‌స్ప్రీ–25 హాస్యానికి వేదికగా నిలువనుందని తెలిపారు.
గూడ్స్ ట్రైన్ మేనేజర్లకు
పదోన్నతులు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న 40 మంది గూడ్స్ ట్రైన్ మేనేజర్లు (గార్డులు) సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్లుగా పదోన్నతులు పొందినట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. పదోన్నతులు పొందిన వారిలో కొందరిని బెల్లంపల్లి, రామగుండం, డోర్నకల్‌కు రైల్వేస్టేషన్లకు బదిలీపై పంపిస్తూ సికింద్రాబాద్ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన పలువురికి కాజీపేట రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్ రిలీవ్ లెటర్స్ అందజేశారు.
ఓపెన్ బీఎడ్ అడ్మిషన్ ఫీజు గడువు పొడిగింపు
విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఎడ్ (ఓడియల్) అడ్మిషన్ ఫీజు చెల్లింపు గడువును ఈనెల 22 వరకు పొడిగించినట్లు ఆ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25సంవత్సరానికిగాను బీఎడ్ ఓడియల్ ప్రవేశ పరీక్ష–24 మొదటి దశలో కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 22 వరకు ఫీజు చెల్లించాలని కోరారు. పూర్తి వివరాలకు 040–23680333/444/544 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. లేదా సంబంధిత వెబ్‌సైట్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
280 బస్తాల నూకలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment