పంటలకు సమృద్ధిగా నీరందించాలి
వర్ధన్నపేట: పంటలు ఎండిపోకుండా నీరందించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మండలంలోని నల్లబెల్లి గ్రామంలో నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి ఎస్సారెస్పీ కాల్వ నీటి లభ్యతను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ రైతుల పంట పొలాలకు సమృద్ధి నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘాన్ని తనిఖీ చేసి నిల్వ ఉన్న యూరియాను పరిశీలించారు. రైతులు పంటలకు మోతాదుకు మించి యూరియా వాడొద్దని సూచించారు. అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోట్‌బుక్స్, పెన్నులు అందించారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.
పంటల ఆన్‌లైన్ పరిశీలన
పర్వతగిరి: కొంకపాకలో పంటల ఆన్‌లైన్ ప్రక్రియను ఏడీఏతో కలిసి కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం చౌటపల్లిలో పీఏసీఎస్‌ను సందర్శించారు. పంటల సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సమయం వృథా కాకుండా కౌంటర్ల వద్ద అందుబాటులో ఈ పాస్ మిషన్లను అందుబాటులో ఉంచాలని ఏడీఏను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ ప్రశాంత్‌కుమార్, ఏఈఓ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రుణాలు అందించాలి
వరంగల్: జిల్లాలోని ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూములకు పంట రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కలిగిన రైతులు రుణాల మంజూరులో ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. బ్యాంకు అధికారుల నిబంధనలను పరిగణనలోకి తీసుకుని వారికి నివేదికలను సమర్పించాలని డీటీడీఓకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి రుణాలు అందించేందుకు ప్రణాళికలు తయారుచేసి బ్యాంకర్లకు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీటీడబ్ల్యూఓ సౌజన్య, లీడ్ బ్యాంకు అధికారి రాజు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నల్లబెల్లిలో ఎస్సారెస్పీ కాల్వ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment