పాకాలకు బ్యాటరీ వాహనాలు
జిల్లాలో పర్యాటక ప్రాంతమైన పాకాలను అటవీశాఖ ఆధ్వర్యంలో ఆధునీకరిస్తున్నారు. పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. బోటింగ్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పర్యాటకులు ప్రధాన ముఖద్వారం నుంచి వ్యూ
పాయింట్‌ను వీక్షించడానికి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. దీంతో రెండు బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఒక్కో వాహనంలో పది మందికి పైగా కూర్చొని పాకాలను వీక్షించే అవకాశం కలుగనుంది. రెండు వాహనాలను త్వరలోనే ప్రారంభించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. – ఖానాపురం
Comments
Please login to add a commentAdd a comment