వ్యవసాయ బావిలో శ్వేతనాగు
దుగ్గొండి: వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిన శ్వేత నాగును సురక్షితంగా బయటికి తీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన ఓ రైతుకు దుగ్గొండి మండల శివారులో వ్యవసాయ భూమి ఉంది. కొత్తగా తవ్వుతున్న బావిలో కొద్దిమేర నీరుండగా శుక్రవారం ఉదయం అందులో తెల్లటి నాగుపాము కనిపించింది. గమనించిన యజమాని దానిని కాపాడాలనుకుని పాములు పట్టే (స్నేక్‌క్యాచర్) దుగ్గొండి గ్రామానికి చెందిన ఎలబోయిన సాంబరావును పిలిపించాడు. కొద్దిపాటి నీళ్లను తోడాక సాంబరావు బావిలోకి దిగి శ్వేతనాగు పామును ప్రాణాలతో ఒడిసి పట్టుకున్నాడు. అనంతరం ఊరి చివరి వాగు ఒడ్డున పొదల మధ్య వదిలిపెట్టాడు.
సురక్షితంగా బయటకు తీసిన స్నేక్‌క్యాచర్
Comments
Please login to add a commentAdd a comment