దైవభక్తి కలిగి ఉండాలి
నెక్కొండ: ప్రతిఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. చంద్రుగొండ క్రాస్‌రోడ్డు (పనికర గుట్ట) లోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం, రేణుకాఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. భక్తులకు వసతులు కల్పించిన ఆలయ నిర్వాహకులకు ఎమ్మెల్యే అభినందించారు. టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, పెండెం రామానందం, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, నర్సంపేట కోర్టు ఏపీజీ బండి శివకుమార్, ఆలయ పూజారి చెవ్వ భిక్షపతి, నాయకులు కుసుమ చెన్నకేశవులు, రావుల మహిపాల్‌రెడ్డి, తమ్మిశెట్టి సాంబయ్య, వడ్డె సురేశ్, బక్కి కుమారస్వామి, బత్తిని శ్రీధర్, నల్లపు రాజేందర్, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment