బీసీ అభ్యర్థులకు ఓటు వేయండి
నయీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రకులాల నోట్లను తిరస్కరించి.. బీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ కోరారు. ఆదివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో వివిధ బీసీ కుల సంఘాల నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్‌రాజ్ యాదవ్, డాక్టర్ వెంకటస్వామిలను భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా రాష్ట్రంలో బీసీల శకం ప్రారంభమవుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 26వేల ఓట్లు ఉంటే అందులో కేవలం 2వేల ఓట్లు మాత్రమే ఆధిపత్య వర్గాల వారివి ఉన్నాయని, మిగతా ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలవని చెప్పా రు. మన ఓట్లు మనం వేసుకుంటే విజయం సాధించుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు తాళ్ల సంపత్‌కుమార్, సాయిని నరేందర్, కందికొండ వేణుగోపాల్, బోనగాని యాదగిరి గౌడ్, ఎదునూరి రాజమౌళి, పల్లెబోయిన అశోక్, చందా మల్లయ్య, జనగాని శ్రీనివాస్ గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment