● భయమేస్తోంది.. పరీక్ష రాయను
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల 6, 9 తరగతిల్లో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పలివేల్పుల సమీప సాంఘిక గురుకుల పాఠశాలకు సెంటర్ కేటాయించా రు. పరీక్ష రాయడానికి వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో వచ్చారు. కొందరు విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి వెళ్లడానికి సతాయిస్తున్నారు. పరీక్ష రాయను.. భయమేస్తోంది.. అంటూ తమ తల్లిదండ్రులతో మారాం చేస్తున్నారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న కేయూ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి వెళ్లి పిల్లలతో మాట్లాడి ఽధైర్యం చెప్పి ఎగ్జామ్ సెంటర్‌లోకి పంపించారు.
– హసన్‌పర్తి
Comments
Please login to add a commentAdd a comment