చూపు పదిలం
ఆలయం ఎదురుగా నంది విగ్రహం
ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దేవతా విగ్రహాలు
దృష్టిలోపం గుర్తించి విద్యార్థుల
వివరాలు మండలాలవారీగా..
హనుమకొండ 268
కాజీపేట 240
కమలాపూర్ 300
దామెర 288
ఎల్కతుర్తి 230
ఐనవోలు 101
ధర్మసాగర్ 157
ఆత్మకూరు 250
హసన్‌పర్తి 228
శాయంపేట 210
భీమదేవరపల్లి 120
పరకాల 120
వేలేరు 28
నడికూడ 17
మొత్తం 2,557
విద్యారణ్యపురి: నయనం ప్రధానం.. కంటి చూపులేని జీవితం ఊహించుకోలేం.. ఒకప్పుడు వయసు మీదపడిన వారికి దృష్టి లోపం సహజంగా వచ్చేది. ప్రస్తుత పరిస్థితుల్లో వయసుతో పనిలేదు. విద్యార్థి దశలోనే దృష్టిలోపం వస్తున్నది. తరగతి గదిలో బోర్డుపై రాసిన అక్షరాలు సక్రమంగా కనిపించక చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అత్యధిక శాతం కంటి అద్దాలు వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు సెల్‌ఫోన్‌ల వినియో గం, టీవీల ప్రభావం ఒక కారణమైతే.. పౌష్టికాహారం, విటమిన్ల లోపం మరో కారణంగా చెప్పవచ్చు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కంటి పరీక్షలు చేయిస్తున్నది.
ఇప్పటికే రెండు దశల్లో పరీక్షలు
హనుమకొండ జిల్లాల్లో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీలు, మోడల్‌స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు కలిపి 968 ఉండగా వాటిలో చదువుతున్న విద్యార్థులకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గత ఏడాది మొదటి దశలో మార్చి–ఏప్రిల్‌లో కంటి పరీక్షలు నిర్వహించారు. తిరిగి సెప్టెంబర్–అక్టోబర్–నవంబర్‌లో రెండో దశ పరీక్షలు చేపట్టారు. 30వేల మందికిపైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
2,557 మందికి దృష్టిలోపం..
జిల్లాలోని 137 పాఠశాలల్లో 2,557 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు పాఽథమికంగా నిర్ధారించారు. మండలాల్లోని పాఠశాలల వారీగా జాబితా రూపొందించి వారికి ఈనెల 17వ తేదీ నుంచి వరంగల్‌లోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో మరోసారి కంటి పరీక్షలు చేస్తున్నారు. డీఈఓ వాసంతి, సమగ్రశిక్ష సమ్మిళిత విద్యా సమన్వయకులు బద్దం సుదర్శన్‌రెడ్డి పర్యవేక్షణలో రోజూ కొంతమంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 22వ తేదీ వరకు 1,455 మందికి పరీక్షలు చేశారు. పిల్ల లను వైద్య ఆరోగ్యశాఖ వారే వాహనంలో పాఠశాల నుంచి తీసుకువెళ్లి.. తీసుకొస్తారని విద్యాశాఖ అధి కారులు చెబుతున్నారు. దృష్టిలోపం ఉన్నవారికి అవసరమైతే శస్త్ర చికిత్స, లేదంటే కంటి అద్దాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణియించింది. ఈనెల 28 వరకు కంటి పరీక్షలు పూర్తియ్యాక ఎంత మందికి ఏమి అవసరమో తెలుస్తుంది. ఆ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆమోదం మేరకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు. కంటి అద్దాలు అవసరమైనవారికి ఉచితంగా అందజేస్తారు. కంటి ఉపకరణాలు కూడా ఉచితంగానే ఇవ్వనున్నారు.
విద్యార్థులకు ‘కంటి’ పరీక్షలు
2,557 మందిలో దృష్టిలోపం గుర్తింపు
137 పాఠశాలల్లో మరోసారి స్క్రీనింగ్
ఈనెల 28 వరకు
ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఐ టెస్టింగ్
అవసరమైనవారికి
శస్త్ర చికిత్స, కంటి అద్దాలు
అతుక్కుపోతున్నారు..
పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి చేరిన వెంటనే చాలా మంది సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. వీడియో గేమ్‌లు, కార్టూన్ సీరియళ్లు ఇతరత్రా గంటల తరబడి చూస్తూ ఉండిపోతున్నారు. హోం వర్క్‌ల కంటే వీటిపైనే అధికంగా దృష్టి సారిస్తుండడంతో చిన్న వయసులోనే సోడాబుడ్డి లాంటి కంటి అద్దాలు ధరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సమయంలో ఆన్‌లైన్‌విద్యతో తల్లిదండ్రులు కూడా విద్యార్థులను తప్పని సెల్‌ఫోన్‌ల వినియోగంవైపు మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. అదికాస్త అలవాటుగా మారిందని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment