ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
● సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా
కమలాపూర్: ఇసుక అక్రమ రవాణాకు పాల్ప డితే సహించేది లేదు.. కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణ కోసం కమలాపూర్ మండలంలోని భీంపల్లి, అంబాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్ పో స్టులను ఆదివారం ఆమె సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇసు క అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టా లని సిబ్బందిని ఆదేశించారు. అక్కడి నుంచి వెళ్లి అంబాల, నేరెళ్ల వాగులను పరిశీలించారు. ఆమె వెంట స్థానిక ఇన్‌స్పెక్టర్ ఇ.హరికృష్ణ, చెక్ పోస్టు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
హన్మకొండ అర్బన్/వరంగల్ : హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో నేడు(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను రద్దు చేసినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్లకు రావొద్దని సూచించారు.
ముగిసిన ‘ఇంటర్ నిట్’
టోర్నమెంట్స్
కాజీపేట అర్బన్: వరంగల్ నిట్‌లో వాలీబాల్, హ్యాండ్‌బాల్, యోగా క్రీడల ‘ఇంటర్ నిట్’ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది బహుమతులు ప్రదానం చేసి అభినందించి మాట్లాడారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెస ర్ శ్రీనివాసాచార్య, హెడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఆక్టివిటీస్ ప్రొఫెసర్ రవికుమార్ పాల్గొన్నారు.
మే 5న ‘కెమిస్ట్–డ్రగ్గిస్ట్’
అసోసియేషన్ ఎన్నికలు
ఎంజీఎం: హనుమకొండ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్ని కలు, సర్వసభ్య సమావేశం మే 5న నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రేణికింది శ్రీనివాస్, మోత్కురి మధుకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మార్చి 20 లోపు రుసుం చెల్లించాలన్నారు. ఓటర్లు మూడే ళ్ల సభ్యత్వ రుసుం క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించి 9502720222 నంబర్‌కు వాట్సాప్ చేసి ఓటర్ ఐడీ కార్డు పొందాలని సూచించారు. ఎన్నికల అధికారులుగా కన్నయ్యలాగ్, పురుషోత్తం, రమేష్ వ్యవహరిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment