పంచ పరివర్తనతోనే సమాజ కల్యాణం
కేయూ క్యాంపస్: పంచ పరివర్తనతోనే సమాజ కల్యాణం జరుగుతుంది.. వ్యక్తి నిర్మాణం ఆధారంగానే వ్యవస్థలో మార్పు వస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వరంగల్ మహానగరంలోని 100 ఆర్‌ఎస్‌ఎస్ శాఖల నుంచి స్వయం సేవకులతో ‘మహానగర సాంఘిక్’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సూర్య నమస్కారాలు, యోగా, వ్యాయామం, ఆటల తరువాత రమేశ్ మాట్లాడా రు. సమాజంలో మార్పురావాలంటే ఐదు విషయాల్లో జరగదని, కుటుంబ వ్యవస్థ, స్వదేశీ, సామరస్యత, పర్యావరణ పరిరక్షణ తదితర విషయాల్లో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలన్నారు. పంచభూతాలు కలుషితం కాకుండా కాపాడుకుంటేనే పర్యావరణం రక్షించబడుతుందని చెప్పారు. ప్లాస్టిక్ రహిత దేశం కావాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్‌ను పెంచి పర్యావరణాన్ని రక్షించుకోవచ్చ ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్ చిలుకమారి సంజీవ, ఉపాధ్యక్షుడు పెద్ది మల్లారెడ్డి, వరంగల్ మహానగర అధ్యక్షుడు డాక్టర్ బి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్
Comments
Please login to add a commentAdd a comment