పురుగుల మందు తాగిన రైతు
నడికూడ : అధికారుల వేధింపులు తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగాడు. ఈ ఘటన మండలంలోని ధర్మారంలో చోటుచేసుకుంది. పరకాల పోలీసుల కథనం ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన భాషక రవికి అంబాల రోడ్డులో వ్యవసాయ భూమి ఉంది. ఇసంపల్లి చంద్రయ్య, దయాకర్, వినాయకర్ కొన్ని రోజులుగా రవి భూమిలో తమ భూమి ఉందని ఆరోపిస్తూ గొడవకు దిగుతున్నారు. సోమవారం మండల భూ సర్వేయర్ దేవరకొండ ప్రసన్న, ప్రైవేట్ సర్వేయర్‌తో వచ్చి భూమిలో హద్దులు ఏర్పాటు చేస్తుండగా రవి ప్రాధేయపడిన వినలేదు. దీంతో మనస్తాపం చెందిన రవి అక్కడే ఉన్న గడ్డిమందు తాగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రవి భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరకాల పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment