62కిలోల గంజాయి స్వాధీనం
ఆత్మకూరు: ఒడిశా నుంచి సూరత్‌కు అక్రమంగా తరలిస్తున్న 62 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కన్ష్ జాను, అలోక్ ప్రధాన్, మంగు ప్రధాన్‌లు సూరత్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా గుడెప్పాడ్ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని రూ.30 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ సంతోష్ తెలిపారు. తనిఖీల్లో ఎస్సైలు తిరుపతి, శ్రావణ్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment