విద్యారణ్యపురి: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బహుజన బిడ్డగా ఎన్నికల బరిలో ఉన్న తనను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కోరారు. సోమవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పింగిళి ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులను కలిసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. సాయంత్రం హరిత కాకతీయలో విలేకరులతో మాట్లాడారు. 2013నుంచి 2019వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అనేక టీచర్ల, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించానని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాల జాక్టో,వివిధ అధ్యాపకుల సంఘాల మద్ధతుతో బరిలో ఉన్నానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పండిట్ల, పీఈటీల అప్‌గ్రేడేషన్ కోసం పదోన్నతి ఉత్తర్వులు తానే తీసుకొచ్చానన్నారు. టీచర్ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని, బహుజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతానని హామీ ఇచ్చారు.
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్
Comments
Please login to add a commentAdd a comment