9న జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 9న హనుమకొండ జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమల్‌కింగ్ చెస్ అకాడమీ చైర్మన్ జి.రాంప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని తెలిపారు. విజేతలకు నగదు పురస్కారం, ట్రోఫీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్‌లోని న్యూసైన్స్ డిగ్రీ కళాశాల ఆవరణలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకునేందుకు 96760 56744 మొబైల్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
భవిత కేంద్రం తనిఖీ..
విద్యారణ్యపురి: హనుమకొండ మండలంలోని ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు సంబంధించిన భవిత కేంద్రాన్ని సోమవారం డీఈఓ డి.వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల సర్వేను పూర్తి చేసి విద్యార్థుల అవసరాలను గుర్తించి నమోదు చేయాలని సమ్మిళిత ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వెంట సమ్మిళిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఎంఈఓ నెహ్రూ, సమ్మిళిత ఉపాధ్యాయురాలు రజనీ తదితరులు పాల్గొన్నారు.
పంచేంద్రియాల్లో
ముఖ్యమైనవి చెవులు
హన్మకొండ: పంచేంద్రియాల్లో చెవులు ముఖ్య మైనవని హనుమకొండ వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య అన్నారు. సోమవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్‌సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చెవి, వినికిడి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. చెవి ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు అశ్రద్ధ వహించకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి అహ్మద్, లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, సోషల్ వర్కర్ నరేశ్, హెచ్‌ఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్లు బాబు, శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు ఆశవర్కర్లు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో
ఉచిత వైద్యశిబిరం
వరంగల్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసో సియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా నేడు (మంగళవారం) ఉదయం 10గంటలకు ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, మహిళా విభాగం ప్రతినిధులు అనురాధ, నీరజ సోమవారం తెలిపారు. ఈ ఉచిత వైద్యశిబిరంలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన మహిళా అధికారులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే మహిళా దినోత్సవ వేడుకలు ఈనెల 7న నిర్వహించనున్నట్లు తెలిపారు.
టెండర్ల గడువు పొడిగింపు
వరంగల్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పత్రాల ముద్రణకు నిర్వహిస్తున్న టెండర్ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు జెడ్పీ సీఈఓ జి.రాంరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో స్టేషనరీ, పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఆధీకృత డీలర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment