No Headline
శాయంపేట: రెండేళ్లుగా మిస్టరీగా మిగిలిన ఆరెపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు వాడికాల బొద్దమ్మ హత్య కేసు శాయంపేట సీఐ రంజిత్‌రావు ఛేదించిన విషయం తెలిసిందే. సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సీఐని అభినందిస్తూ నగదు పురస్కారం అందజేశారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బొందమ్మ హత్య కేసులో పోలీసులకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. దీనికి తోడు ఘటన జరిగిన అనంతరం పరకాల పోలీస్ స్టేషన్‌లో పలువురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈకేసును శాయంపేట సీఐ రంజిత్‌రావుకు అప్పగించగా.. ఏసీపీ పర్యవేక్షణలో దర్యాప్తు చేశారు. బంగారు ఆభరణాల కోసం అదే గ్రామానికి చెందిన ఇంటి రాజిరెడ్డి హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేల్చారు. వృద్ధురాలిని హత్య చేసిన రాజిరెడ్డిని గత నెలలో పరకాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు సవాలుగా నిలిచిన ఈహత్య కేసును ఛేదించినందుకు సీఐ రంజిత్‌రావుకు సీపీ నగదు పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment