ఎండలకు జాగ్రత్త
● జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను
ఐనవోలు: ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం 8 గంటల్లోపే పనిలోకి రావాలని, జాగ్రత్తగా పనులు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) మేన శ్రీను సూచించారు. సోమవారం మండలంలోని పంథిని, పున్నేలు, ఐనవోలు గ్రామాల్లో ఉపాధి పనులను డీఆర్డీఓ పర్యవేక్షించారు. పంథినిలో రోడ్డు పని, పున్నేలు, ఐనవోలులో జరుగుతున్న ఫారం పాండ్, నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో మాట్లాడుతూ.. ప్రతీరోజు రూ.300 వేతనం వచ్చేలా కొలతల ప్రకారం పని చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 50 మంది కూలీలతో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. టార్గెట్ ప్రకారం కాకుండా తక్కువ లేబర్‌తో పని చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీఓ నక్క కుమారస్వామి, ఈసీ ప్రదీప్, టీఏలు నీరజ, రమేశ్, కార్యదర్శులు అశోక్, మాలతి, ఎఫ్‌ఏలు రాజు, ఎలేంద్ర, జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment