అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలని హనుమకొండ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ కోరారు. జిల్లాలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా నియమితులైన ఎస్జీటీలకు హనుమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠ్యపుస్తకాల వినియోగం, తరగతి గదిలో బోధనకు సంబంధించి అభ్యసన సామర్థ్యాల, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక సమ్మెటివ్ మూల్యాంకనం, డిజిటల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. సమావేశంలో రిసోర్స్ ఉపాధ్యాయులు పి.చంద్రయ్య, శ్రీపాల్‌రెడ్డి, శ్యాంసుందర్, పున్నం చందర్, డీఎల్‌ఎంటీ రఘు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment