మరింత చేరువగా ఆరోగ్య సేవలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్ ఐడీఓసీ భవనంలోకి వైద్య ఆరోగ్య కార్యాలయం ఉండడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా వైద్య ఆరోగ్య శాఖ సేవలు అందనున్నాయని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోకి మార్చిన వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీ లించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్మోహనరావు, పీఓడీటీసీ కె.లలితాదేవి, హిమబిందు పాల్గొన్నారు.
ఈజీఎస్ పనులు త్వరగా పూర్తి చేయండి
జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా మండలాల్లో చేపట్టిన నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈజీఎస్, పంచాయతీరాజ్ శాఖ అధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి, నిర్దేశిత లక్ష్యాల గడువుపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజీఎస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఈ శంకరయ్య, డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓలు, పీఆర్ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment