డీజే సౌండ్స్ నిషేధం
గీసుకొండ: హోలీ పండుగ నుంచి ప్రారంభమయ్యే కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో డీజే సౌండ్స్, రికార్డింగ్ డ్యాన్స్‌లను నిషేధించామని, ఎవరైన జాతరలో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మామునూరు, నర్సంపేట ఏసీపీలు తిరుపతి, కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం కొమ్మాల ఆలయం సమీపంలోని విష్ణుప్రియ గార్డెన్‌లో పలు రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ సమావేశంలో వారు మాట్లాడారు. కొన్ని షరతుల మేరకు జాతరలో రాజకీయ ప్రభలకు అనుమతి ఇస్తున్నామని, ఎవరి ప్రభలకు ఆయా పార్టీల నాయకులే బాధ్యత వహించాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 400 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని, డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. గత జాతరలో వరంగల్–నర్సంపేట రహదారిపై ఐదు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడంతో ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇబ్బంది పడ్డారన్నారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కొమ్మాల, గిర్నిబావి వద్ద తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసి బస్సులను నిలుపుతామన్నారు. ఈ సమావేశంలో ఈఓ నాగేశ్వర్‌రావు, అర్చకులు రామాచారి, సీఐలు మహేందర్, రమణమూర్తి, శ్రీనివాస్, సాయిరాం, ఎస్‌ఐలు కె. కుమార్, ప్రశాంత్‌బాబు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంసీపీఐ(యు) నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్, వీరగోని రాజ్‌కుమార్, రడం భరత్, గట్టికొప్పుల రాంబాబు, కక్కెర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కొమ్మాల జాతరలో షరతులతో రాజకీయ ప్రభలకు అనుమతి
400 మంది పోలీసులతో బందోబస్తు
మామునూరు, నర్సంపేట
ఏసీపీలు తిరుపతి, కిరణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment