వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
గీసుకొండ: గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. గోవిందా.. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గోవిందా.. అంటూ రాత్రి 10 గంటలకు నిర్వహించిన అశ్వవాహన సేవలో భక్తులు పారవశ్యంతో మునిగితేలారు. అనంతరం గుట్ట కిందికి స్వామివారిని ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా తోడ్కొని వెళ్లారు. ఒక వైపు స్వామివారు ...మరో వైపు అమ్మవార్లు భూదేవి, నీలాదేవీల ఎరుర్కోళ్లు జరిగాయి. రాత్రి 11 గంటలకు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపానికి తీసుకుని వెళ్లి వైభవంగా కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, ఫణి, శేషు, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్, వీరాటి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment