ఎటు చూసినా ఎర్ర బంగారమే
మార్కెట్‌కు వచ్చిన 80 వేల మిర్చి బస్తాలు
యార్డుల్లో పోటెత్తిన మిర్చి బస్తాలు
పక్క జిల్లాల నుంచి..
వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతి పెద్దది కావడంతో పక్క జిల్లాలో పండిన మిర్చి సైతం వస్తోంది. పక్క జిల్లాల్లోని మార్కెట్‌లు చి న్నవి కావడం, కొన్ని రకాలు మాత్రమే కొనుగోళ్లు చేస్తుండడంతో ఇక్కడికి బాట పడుతున్నారు. వరంగల్ మార్కెట్‌లో సుమారు 20 రకాల మిర్చిని వ్యా పారులు కొంటున్నారు. ధరలు తక్కువగా ఉంటే ఇ క్కడ మిర్చిని నిల్వ చేసే సామర్థ్యం కూడా ఉండడంతో రైతులు ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించేందుకు రైతులు భారీ మొత్తంలో మిర్చిని యార్డులకు తీసుకొస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం సుమారు 80 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో ఏ యార్డు చూసినా ఎర్ర బంగారమే కనిపించింది. వేలాది బస్తాలు రావడం, ఎండలు పెరిగిపోవడంతో మార్కెట్‌లోని హమాలీ కార్మికులు కాంటాలు పెట్టడంలో జాప్యం జరుగుతోంది. అన్ని రకాల మిర్చి రావడంతో ఘాటు పెరిగి కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment