
మజారే.. మండి బజారే!
శనివారం రాత్రి మండిబజార్‌లో కిక్కిరిసిన జనం
ముక్కుపుటాలదిరేలా మాంసాహార వంటకాలు. మనసుకు హత్తుకునేలా అత్తరు సువాసనలు.. చూపుతిప్పనివ్వని బ్యాంగిళ్లు. ఆహార్యానికి అందం తెచ్చే కుర్తా పైజామాలు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతులు. అవన్నింటికీ కేరాఫ్ మన మండి బజార్. నగరానికి ఐకాన్‌గా నిలుస్తున్న ఈ ప్రాంతం ఓ మినీ చార్మి నార్. రంజాన్ వేళ రాత్రి సైతం రద్దీగా ఉండే ఈ ప్రాంతంపై ‘సాక్షి’ సండే స్పెషల్.
– సాక్షి, వరంగల్
రంజాన్ సమయంలో మండిబజార్‌లో దొరికే తినుబండారాలకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పత్తర్ కా ఘోష్, మరగ్, పాయా, హలీం, అచార్ కా ఘోష్, బోటి కబాబ్, ఫిష్ కబాబ్, చికెన్–65, చికెన్ మెజెస్టిక్ వంటి మాంసాహార వంటకాలు ఆ ప్రాంతం నుంచి మనల్ని కదలకుండా చేస్తాయి. చికెన్ రోల్, 65 రోల్, మెజెస్టిక్, స్టిక్ చికెన్, బంజారా చికెన్, కేఎఫ్‌సీ చికెన్, మటన్ హలీమ్, చికెన్ హరీస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అతారీ చికెన్, మలై చికెన్, సాదిక్ ముర్గీ వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు పలు రకాల మిఠాయిలు ఆహారప్రియుల నోరూరిస్తున్నాయి. సోరకాయ స్వీట్, డబుల్‌కమీటా, బాదమ్‌కా కీర్, గుమ్మడికాయ స్వీట్లు తెగ తినేస్తున్నారు. కాజు, బాదం, పిస్తాలు కలిపి తయారుచేసే సన్రైజ్ ఫుటింగ్ కేక్, ఐస్క్రీమ్‌లు ఇక్కడ ప్రత్యేకం అని దుకాణాదారులు చెబుతున్నారు. అలాగే మహబత్‌కా షర్బత్ (పాలలో పుచ్చకాయ రసం మిక్స్ చేస్తారు)కు కూడా ఆహారప్రియులు ఫిదా అవుతున్నట్లు చెబుతున్నారు.
నోరూరిస్తున్న రంజాన్ స్పెషల్స్..

మజారే.. మండి బజారే!