
చట్టంపై అవగాహన తప్పనిసరి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే
కాజీపేట అర్బన్: ప్రతి ఒక్కరూ వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే తెలిపారు. హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని సఖి వన్‌స్టాప్ సెంటర్‌లో శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే హాజరై మాట్లాడారు. వినియోగదారులు కొన్న వస్తువులు నాణ్యతగా లేకపోయినా, కల్తీ జరిగినా.. డబ్బులు చెల్లించి పొందే సేవల్లో లోపాలున్నా.. వినియోగదారుల పరిష్కార కమిషన్ ద్వారా పరిహారం పొందే అవకాశం ఉందన్నారు. వస్తువుల కొనుగోలులో మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసి నష్టపోయినప్పుడు నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ 1915కు లేదా 88000 01915కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, బీఐఎస్–కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఐఎస్‌ఐ మార్క్ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలని వినియోగదారుల సమన్వయ సమితి అద్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి, సఖిసెంటర్ అడ్మిన్ హైమావతి, సీడీపీఓ విశ్వజ, ఇందిర, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో 359 మంది గైర్హాజరు
విద్యారణ్యపురి: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో శనివారం 359 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 17,277 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. వారిలో 16,918 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.