
పదో తరగతి పరీక్షలు షురూ
వరంగల్/గీసుకొండ: జిల్లాలోని 49 కేంద్రాల్లో శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. 9,238 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 9,223 మంది విద్యార్థులు (99.8 శాతం) హాజరై 15 మంది గైర్హాజరయ్యారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద వరంగల్ నగరంలోని ప్లాటినం జూబ్లీ పాఠశాల, గీసుకొండ మండల కేంద్రం, ధర్మారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. సదుపాయాలు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాలను పరిశీలించారు. వేసవి కావడంతో విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు, క్యాలికులేటర్లను అనుమతించవద్దని, పోలీస్ ఎస్కార్ట్‌తో పరీక్ష, జవాబుపత్రాల రవాణా చేయాలని సూచించా రు. కలెక్టర్ వెంట జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ కరుణ, చీఫ్ సూపరింటెండెంట్లు ఉన్నారు.
విద్యార్థికి అస్వస్థత
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి శుక్రవారం అస్వస్థతకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. రుద్రగూడెంలోని కాకతీయ బ్రిలియంట్ స్టార్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి ఈశ్వర్ పాఠశాలలో పరీక్ష పూర్తిగా రాశాడు. సమయం 15 నిమి షాలు ఉండగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఇన్విజిలేటర్ వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. ఏఎన్‌ఎం మాధవి ప్రథమ చికిత్స అందించి 108కు ఫోన్ చేశారు. అధికారుల సూచనల మేరకు పరీక్ష సమయం ముగిసే వరకు ఆఫీస్ రూంలో 108 సిబ్బంది రామ్మూర్తి చికిత్స అందించారు. అనంతరం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
9,238 మంది విద్యార్థులకు 9,223 మంది హాజరు
పలు కేంద్రాలను తనిఖీ చేసిన
కలెక్టర్ సత్యశారద

పదో తరగతి పరీక్షలు షురూ

పదో తరగతి పరీక్షలు షురూ