
రెన్యువల్ చేస్తేనే విధుల్లో కొనసాగిస్తాం ..
ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన రెన్యువల్ మార్చి 31లోగా ముగిసి పోయింది. దీనిపై ఉన్నతాధికారులకు గతంలోనే నివేదించాం. కానీ, డీఎంఈలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు మాకు రాలేదు. ఆసిబ్బంది రెన్యువల్ పొడిగిస్తున్నట్లు ఆదేశాలు కూడా రాకపోవడంతో ఎలా పనిచేయించుకోవాలి, ఎవరు జీతాలు అందించాలి అనే ప్రశ్నలు తలెత్తాయి. రెన్యువల్ చేస్తున్నట్లు అయినా, డీఎంఈలోకి తీసుకున్నట్లు అయినా లేఖ తెస్తేనే విధుల్లోకి తీసుకోవడం సాధ్యమవుతుందని సిబ్బందికి తెలిపాం.
– డాక్టర్ మోహన్‌దాస్, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్