
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నల్లబెల్లి: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. కొండాపూర్‌లో రూ.2.63 కోట్లతో చేపట్టిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎన్పీడీసీఎల్ సీఈలు రాజుచౌహాన్, జవంత్ చౌహాన్‌తో కలిసి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవరెడ్డి మాట్లాడారు. విద్యుత్ అవసరాలు తీర్చేందుకు, లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మురళీనగర్, గణేశ్‌నగర్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, కొండాపూర్ చెరువును గోదావరి జలాలతో నింపాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రజలు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కాగా, త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్‌ఈ గౌతంరెడ్డి, నర్సంపేట డీఈలు హర్జీ, తిరుపతి, ఏడీఈ లక్ష్మణ్, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి, ఏఈ హరిబాబు, ప్రత్యేక అధికారి పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి